4242) నా జీవితాన కురిసెనే నీ కృపామృతం నా జిహ్వకు


** TELUGU LYRICS **

నా జీవితాన కురిసెనే నీ కృపామృతం
నా జిహ్వకు మధురాతి మధురం నీ నామ గానామృతం 
నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను

నీ దయనుండి దూరము కాగా
ప్రేమతో పిలచి పలుకరించితివే
కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను
నీ కృప వీడి క్షణమైనా నేనెలా మంగలను 
||నా జీవితాన||

నా యేసయ్య - నీ నామమెంతో
ఘనమైనది - కొనియాడ దగినది
కృపయే నా ఆత్మీయ అక్కరలు సమృద్ధిగా తీర్చెను
నీ మహదైశ్వర్యము ఎన్నటికి తరగనిది
||నా జీవితాన||

నీ సన్నిధిని నివసించు నాకు
ఏ అపాయము దరి చేరనివ్వవు
కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను
నీ ఔన్నత్యమును తలంచుచూ స్తుతించెదను 
||నా జీవితాన||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post