4241) నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని యేసయ్యా


** TELUGU LYRICS **

నా అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నావని 
యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెద
నీవే నాకని నేనే నీకని - నాకై విజ్ఞాపన చేయుచున్నావని

ఆదరణ లేని ఈ లోకములో
ఆనుకొంటినే ఎదుటే నిలచిన నీపైనే
అనురాగసీమలో అనుబంధము పెంచిన నీతో
అరణ్య వాసమే నాకు మేలాయెను
||నా అర్ప||

గమ్యమెరుగని వ్యామోహాలలో
గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే 
గాలిని గద్దించి గాలి మేడలు కూల్చిన నీతో
షాలేము నీడయె నాకు మేలాయెను
||నా అర్ప||

మంద కాపరుల గుడారాలలో
మైమరచితినే మమతను చూపిన నీపైనే
మహిమాన్వితమైన నీ మందలో నను దాచిన నీతో
సీయోను ధ్యానమే నాకు మేలాయెను
||నా అర్ప||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------