4243) నా ప్రార్ధనలన్ని ఆలకించినావు నా స్తుతిహోమములన్ని నీకే అర్పింతును


** TELUGU LYRICS **

నా ప్రార్ధనలన్ని ఆలకించినావు
నా స్తుతిహోమములన్ని - నీకే అర్పింతును 
నీ సిలువ త్యాగమే నన్ను బంధించెను
నీ బానిసనై యుందును బ్రతుకు దినములన్నియు

అడిగినంత కంటే అధికముగా చేయు
ఐశ్వర్యవంతుడవు - నీవే యేసయ్యా
పరిపూర్ణమైన - నీ దైవత్వమంతా
పరిశుద్ధతకే - శుభఆనవాలు 
||నా ప్రార్థన||

ఆపత్కాలములో మొరపెట్టగానే
సమీపమైతివే నా యేసయ్యా
సమీప బంధవ్యములన్నిటికన్నా
మిన్నయైనది నీ స్నేహ బంధము
||నా ప్రార్థన||

ఎక్కలేనంత ఎత్తైన కొండపై
ఎక్కించుము నన్ను నా యేసయ్యా
ఆశ్చర్యకరమైన నీ ఆలోచనలు
ఆత్మీయతకే స్థిర పునాదులు
||నా ప్రార్థన||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------