4244) సీయోను రారాజు తన స్వాస్త్యము కొరకై రానై యుండగా


** TELUGU LYRICS **

సీయోను రారాజు - తన స్వాస్త్యము కొరకై 
రానై యుండగా త్వరగా రానై యుండగా 
సంపూర్ణ సిద్ధినొంద స్థిరపడెదము
సంఘ సహవాసములో - ప్రేమ సామ్రాజ్యములో

వివేచించుమా - భ్రమ పరచు ప్రతి ఆత్మను 
ఏర్పరచబడినవారే - తోట్రిల్లుచున్న కాలమిదే
వీర విజయముతో - నడిపించుచున్న పరిశుద్ధాత్మునికి 
విధేయులమై నిలిచియుందము 
||సీయోను||

అధైర్య పడకు - వదంతులెన్నో విన్నాను
ఆత్మాభిషేకము కలిగి - కృపలో నిలిచే కాలమిదే
నిత్య మహిమకు అలంకరించు పరిశుద్ధాత్మునిలో
నిరంతరము ఆనందిచెదము
||సీయోను||

ఆశ్చర్యపడకు ఆకాశ శక్తులు కదలినను
దైవ కుమారులందరు ప్రత్యక్షమయ్యే కాలమిదే 
ఆర్భాటముగా రారాజు యేసు దిగివచ్చే వేళ
రూపాంతరము మనము పొందెదము
||సీయోను||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------