** TELUGU LYRICS **
ఆశ్రయ దుర్గము నీవని
రక్షణ శృంగము నీవేనని (2)
నా దాగు చోటు నీవేనని
నా సమస్తమును నీవు నీవేనని (2)
రక్షణ శృంగము నీవేనని (2)
నా దాగు చోటు నీవేనని
నా సమస్తమును నీవు నీవేనని (2)
నా మార్గములన్నిటిలో చీకటి అలముకొననివ్వక
నీ వెలుగుతో కప్పినావు - నీ తేజస్సుతో నింపినావు
మరణాంధకారములో బంధించబడిన నీ జనులను
మహిమను ప్రసరింపజేసి స్నేహితులుగానే మలుచుకొన్నావు
||ఆశ్రయ||
నీ ప్రభావ మహిమలను నిత్యము ప్రకటించగా
నీ ఆత్మతో నింపినావు - నా ఆత్మకు తృప్తినిచ్చావు
కరువు కోరలలో నలుగుచూ వున్న నీ ప్రజలకు
ఆకాశ వాకిళ్ళు తెరచి సంవృద్ధిగానే సంపదలిచ్చావు
||ఆశ్రయ||
నా విశ్వాస ఓడను బద్దలు కానివ్వక
నీ చేతిలో నిలిపినావు - నీ కౌగిలిలో దాచినావు
ప్రమాదపు అంచులలో ఊగిసలాడు నీ ప్రియులను
జ్ఞప్తికి తెచ్చుకొని సజీవులుగానే దరికి చేర్చావు
||ఆశ్రయ||
** ENGLISH LYRICS **
-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------