4249) వందనాలు వందనాలు వరాలు పంచే నీ గుణ సంపన్నతకు


** TELUGU LYRICS **

వందనాలు వందనాలు
వరాలు పంచే - నీ గుణ సంపన్నతకు
నీ త్యాగశీలతకు నీ వశమైతినే 
అతికాంక్షనీయుడానా యేసయ్యా

ఇహలోక ధననిధులన్ని శాశ్వతముకావని ఎరిగితివే
ఆత్మీయ ఐశ్వర్యము పొందుటకొరకే
ఉపదేశ క్రమమొకటి మాకిచ్చితివే
||వందనాలు||

యజమానుడా నీ వైపు దాసుడనై నా కన్ను లెత్తగా
యాజక వస్త్రములతో నను అలంకరించి
నీ ఉన్నత పులుపును స్థిరపరచితివే
||వందనాలు||

ఆధ్యంతము లేని అమరత్వమే నీ సొంతము
నీ వారసత్వపు హక్కులన్నియు
నీ ఆజ్ఞను నేరవేర్చగా దయచేసితివే
||వందనాలు||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------