4247) త్రియేక దేవుడైన యెహోవాను కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు


** TELUGU LYRICS **

త్రియేక దేవుడైన యెహోవాను
కెరూబులు సెరాపులు నిత్యము ఆరాధించుదురు
పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు అని
గాన ప్రతి గానములు చేయుచూ ఉందును

నా శాపము బాపిన రక్షణతో
నా రోగాల పర్వము ముగిసెనే
వైద్య శాస్త్రములు గ్రహించలేని
ఆశ్చర్యములెన్నో చేసినావే   
||త్రియేక||

నా నిర్జీవ క్రియలను రూపు మాపిన
పరిశుద్ధాత్మలో ఫలించెదనే
మేఘ మదనములు చేయలేని
దీవెన వర్షము కురిపించినావే 
||త్రియేక||

నా స్థితిని మార్చిన స్తుతులతో 
నా హృదయము పొంగిపొర్లెనే 
జలాశయములు భరించలేని
జలప్రళయములను స్తుతి ఆపెనే
||త్రియేక||

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------