4190) ఎంతటి వాడను నేను యేసయ్యా కొంతైనా యోగ్యుడను కానయ్యా


** TELUGU LYRICS **

ఎంతటి వాడను నేను యేసయ్యా
కొంతైనా యోగ్యుడను కానయ్యా (2)
ఇంతగ నను హెచ్చించుటకు
ఈ స్థితిలో నన్నుంచుటకు (2)            
||ఎంతటి||

ఐశ్వర్యము గొప్పతనమును - కలిగించు దేవుడవీవే
హెచ్చించువాడవును - బలమిచ్చువాడవు నీవే (2)
అల్పుడను మంటి పురుగును నన్ను ప్రేమించినావు
ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు 
||ఎంతటి||

నిను వెంబడించువారిని నిజముగ సేవించువారిని
నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని (2)
ఎంతో ఘనపరచెదవు ఆశీర్వదించెదవు
శత్రువుల కంటె ఎత్తుగా అతని తలను పైకెత్తెదవు
||ఎంతటి||

వినయముగల మనుష్యులను వర్దిల్లజేసెదవు
గర్విష్టుల గర్వమునణచి గద్దె నుండి దించెదవు (2)
మాదు ఆశ్రయ దుర్గమా మేమంతా నీ వారమే
మా శైలము మా కేడెమా మాకున్నదంతా నీ దానమే
||ఎంతటి||

** ENGLISH LYRICS **

Enthati Vaadanu Nenu Yesayyaa
Konthainaa Yogyudanu Kaanayyaa (2)
Inthaga Nanu Hechchinchutaku
Ee Sthithilo Nannunchutaku (2)           
||Enthati||

Aishwaryamu Goppathanamunu Kaliginchu Devudaveeve
Hechchinchuvaadavunu Balamichchuvaadavu Neeve (2)
Alpudanu Manti Purugunu Nannu Preminchinaavu
Praanamunu Nee Sarvamunu Naa Korakai Arpinchinaavu
||Enthati||

Ninu Vembadinchuvaarini Nijamuga Sevinchuvaarini
Neevunde Sthalamulalo Niliche Nee Sevakuni (2)
Entho Ghanaparachedavu Aasheervadinchedavu
Shathruvula Kante Eththugaa Athani Thalanu Paikeththedavu 
||Enthati||

Vinayamugala Manushyulanu Vardhillajesedavu
Garvishtula Garvamunanachi Gadde Nundi Dinchedavu (2)
Maadu Aashraya Durgamaa Memanthaa Nee Vaarame
Maa Shailamu Maa Kedemaa Maakunnadantha Nee Daaname 
||Enthati||

---------------------------------------------------------------
CREDITS : ఏ ఆర్ స్టీవెన్సన్ (A R Stevenson)
---------------------------------------------------------------