4189) చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను


** TELUGU LYRICS **
    
    చాచిన చేతులతో ఎదురు చూచుచుండెను
    వేచిన నీ తండ్రి కనులు నిదుర ఎరుగకయుండెను
    ఓ చిన్ని తనయా నీకెన్ని శ్రమలేలనయా
    నీ తండ్రి ప్రేమను గనవా 
    నీ ఇంటికే తిరిగి రావా  
    ||చాచిన||

1.  పనివారు సయితం నీ తండ్రి ఇంట
    రుచియైన అన్నం తినుచుండగా
    కనికరము చూపే వారెవ్వరు లేక
    శుచిలేని పొట్టుకై ఆశించితివా
    ||చాచిన||

2.  నీ క్షేమమును కోరు నీతండ్రి నొదిలి
    ఆ క్షామ దేశమున జీవింతువా
    విస్తార ఆస్థిపై అధికారమును విడిచి
    కష్టాల బాటలో పయనింతువా
    ||చాచిన||

3.  పరిశుధ్ధ తండ్రికి ప్రియ సుతునివైయుండి
    పందులతో నీకు సహవాసమా
    ఏర్పరచబడిన యువరాజువైయుండి
    పనికిమాలిన వారితో స్నేహమా
    ||చాచిన||

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------