4191) ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా


** TELUGU LYRICS **

ఆకాశానికి భూమికి మధ్యను వ్రేలాడుచున్నావా 
ఆ లోకానికి మమ్మును చేర్చను నిచ్చెనవైనావా (2) 
మహనీయుడా నీ బలియాగం (2)
మరువలేని మధుర పర్వం (2) 
||ఆకాశానికి||

పెడరెక్కలు విరిచి కట్టినా మెడ బట్టి నెట్టినా
అపహాస్యము చేసి తిట్టినా ముసుగేసి కొట్టినా (2)
మౌనముగానే సహియించితివా (2)
నా శిక్షను భరియించితివా (2)
||ఆకాశానికి||
       
సిలువను నీతో మోయించినా బహుగా బాధించినా
సిలువకకు మేకులతో బిగియించినా తలపై ముండ్లుంచినా (2)
నీ తగ్గింపును చూపించితివా (2)
శత్రువులను క్షమియించితివా (2)
||ఆకాశానికి||

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------