** TELUGU LYRICS **
విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు
బలము కలిగిన ఆయుధంగా మార్చి
అద్భుతాలు చేసే శక్తిని చేకూర్చి
దీవిస్తాడు జయమిస్తాడు
శ్రమల అలలతో కొట్టబడి
భ్రమల సుడులలో నెట్టబడి
అటుఇటు వంగినా బహుగా క్రుంగినా
అదరిస్తాడు యేసు దేవుడు
పదును గలిగిన మ్రానుగ చేస్తాడు
అనుమానముతో కాల్చబడి
అపనమ్మికతో బ్రతుకు చెడి
ఆత్మలో నలిగినా హృదయం పగిలినా
బాగు చేస్తాడు యేసు దేవుడు
స్థిరమైన సాక్షిగా జీవింప చేస్తాడు
-----------------------------------------
CREDITS : AR Stevenson
-----------------------------------------