4196) కరుణామయుడా నీ త్యాగమే నా హృదయములో నీ ధ్యానమే


** TELUGU LYRICS **

కరుణామయుడా నీ త్యాగమే - నా హృదయములో నీ ధ్యానమే
ఓ ఓ కరుణామయుడా నీ త్యాగమే - నా హృదయములో నీ ధ్యానమే
నా కొరకు బలిఅయితివా - నీ రుణం తీర్చేదెలా
ఓ ఇంత ప్రేమేంటయా - అర్హతే లేని నాపై
మార్చు మా - మార్చు మా 
నీ రక్తములో - నన్నుకడుగుమా
మార్చుమా - మార్చుమా
నీ పోలికలో - నన్ను మార్చుమా  
                    
సిలువలో కలువరి సిలువలో - నీ దేహమే వ్రేలాడుచుండగా
సిలువలో కలువరి సిలువలో - నీ దేహమే వ్రేలాడుచుండగా
ఎన్నెన్నో మార్లు శిలువ వేసిన - నా చేతులే నిన్ను బాధించెనే 
నా కాళ్ళ తో నే నడచిన మార్గమే - నిన్నెంతగానో హింసించెనే 
మార్చు మా - మార్చు మా 
నీ రక్తములో - నన్నుకడుగుమా
మార్చుమా మార్చుమా
నీ పోలికలో - నన్ను మార్చుమా
                          
సిలువలో నీ మరణమే - నాలో ఈ సంఘర్షణ 
పిడుగుద్దులు గుద్ది - మోముపై ఉమ్మి వేసిన
లోకమంతా జనులంతా - నిన్ను నిందించిన
నీ వస్త్రమే పంచుకొని - నిన్ను అపహాసించిన 
చేదు చిరకాను - నీకు అందించిన
ప్రక్కలో బల్లెపుపోటుతో నిన్ను పొడచిన 

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------