4197) నీ సిలువే నాకు వరమై కృప చూపించినది కలుషము బాపినది


** TELUGU LYRICS **

నీ సిలువే నాకు వరమై 
కృప చూపించినది కలుషము బాపినది 
శాశ్వత కాలములకు సరిపోయినది 
సర్వలోకమునకు సువార్త ఇది  
అ: నీ సిలువే నాకు శరణం నాకు మార్గం నాకు గమ్యం 
నీ శిరమే వంచితివా నాకై దేవా

మరణపు ఊబి నుండి నన్ను పైకి లేవనెత్తి 
నీవు మరణము పొందినంతగా ప్రేమ చూపితివి (2)
విధేయతను చూపితివి విమోచను నిచ్చితివి 
రక్షణను నిచ్చుటకు రిక్తునిగా మారితివి (2) 
||నీ సిలువే||

నా ఘోర శిక్ష నుండి నన్ను నీవు తప్పించుటకు 
నీ శరీరము నలిగినంతగా అంగీకరించితివి (2)
విముక్తినిగా చేసితివి వినయమును నేర్పితివి 
మోక్షముకు చేర్చుటకు వారధిగా మారితివి (2)
||నీ సిలువే||

-------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments