4133) ఏసయ్య ఏసయ్య నా మంచి ఏసయ్యా నీవు లేని రోజు ఈ రోజే కాదయ్యా

    
** TELUGU LYRICS **
    
    ఏసయ్య ఏసయ్య నా మంచి ఏసయ్యా  
    నీవు లేని రోజు ఈ రోజే కాదయ్యా (2)
    పాపములో ఉన్న నన్ను కాపాడితివయ్యా  
    ఏమి లేని నన్ను నీవు ప్రేమించావయ్యా 
    నీ ప్రేమ నీ జాలి నేను మరువలేనయ్యా  
    నీ  కరుణ నీ మహిమ వివరించలేనయ్యా
 (2)

    వీధులలో నాట్యము ఆడినా  
    దావీదు వలె నిన్ను స్తుతించాలయ్యా 
    ప్రార్ధన చేయగా ఫలితము పొందినా  
    ఏలియా వలె నేను ప్రార్ధించాలయ్యా
 (2)
    స్తుతియించే స్తుతియించే నీ ఆత్మ నింపయ్యా   
    ప్రార్ధించే ప్రార్ధించే నీ శక్తి నిమ్మయ్యా
 (2)
    ఏలే ఏలీలో

    దేవుని ఇంటిలో నమ్మకస్తుడైన  
    మోషే వలె నేను నడవాలయ్యా 
    అగ్నిగుండమెదురైనా షడ్రకు మేషకు 
    ఆబెద్నగోలు వలె  నిలవాలయ్యా 
 (2)
    నడిపించు నడిపించు నా తోడు నీడగా  
    సాక్షిగా నీ సాక్షిగా నను వాడుకోవయ్యా
 (2)

    ఎన్ని నిందలొచ్చినా శ్రమలెదురైనా  
    పౌలు వలె నిన్నే ప్రకటించాలయ్యా 
    ఏసయ్యా నీ ప్రేమను కలిగి 
    నీ వలె మాదిరిగా బ్రతకాలయ్యా
 (2)
    ఆరాధన ఆరాధన నీకే ఏసయ్య 
    ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఏసయ్య
 (2) 
    ||ఏసయ్య ఏసయ్య||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune, Vocals : Shaik Janna
-------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post