4132) నా ప్రాణమా నా అంతరంగమా యెహోవాను సన్నుతించుము

  
** TELUGU LYRICS **

    నా ప్రాణమా నా అంతరంగమా
    యెహోవాను సన్నుతించుము
    దేవుడు చేసిన ఉపకారములలో దేనిని మరువకుమా

    నీ దోషములన్నిటిని - క్షమించు వాడు
    నీ సంకటములన్నియు కుదుర్చు వాడు
    సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు
    కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు
    సన్నుతించవే సర్వమా నీవు పాట పాడవే స్వరమా

    నరుని ఆయుషు - లేత గడ్డి వలె ఉన్నది
    గాలి వీచగా అది రాలిపోవుచున్నది
    యెహావా యందు భయభక్తులకు ఆయన కృప నిలుచును.
    ఆయన నీతి తరతరములుండును
    ధ్యా నించవే ఆత్మ నీవు నాట్యమాడవే ఆత్మ 

    యెహోవా ఆకాశమందు ఆసీనుడైనాడు 
    ఆయనే అన్నిటి పైన రాజ్యమేలుచున్నాడు
    యెహోవా దూతలారా - బలమైన శూరులారా ఆయనను సన్నుతించుడి.
    పరిచారకులారా సమస్త కార్యములారా ఆయనను స్తుతియించుడి.
    ప్రణుతించవే ప్రాణమా - నీవు పాట పాడవే మౌనమా

-------------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------------