4114) ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు కన్నీళ్లు తుడుచుటకు


** TELUGU LYRICS **

ఎన్నిక లేని నన్ను ఎన్నుకున్నావు
కన్నీళ్లు తుడుచుటకు కన్నతండ్రివైనావు (2)
కలకాలం నివసించాలని నాతో నీవున్నావు 
చిరకాలం జీవిస్తానని నీతో నేనుంటాను
 (2)
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
||ఎన్నిక లేని నన్ను||

ఎన్ని బాధలోచినా వేడిపోను యేసయ్యా 
నీ చిత్తమే నన్ను బలపరిచెనయ్యా
 (2)
ఊపిరి ఉన్నంతవరకు నీ నామ స్మరణయే
ప్రాణం ఉన్నంత వరకు నీ కొరకే ప్రయాస
 (2)
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
||ఎన్నిక లేని నన్ను||

లోకములో ఎందరు వున్నా ఒంటరినే నేనెపుడూ
నీతోడు నాకుండగా ఒంటరిని కాదెపుడు
 (2)
ఈ జీవం నీవిచ్చినదే ఈ బ్రతుకు నీకే
ఈ దేహం నీవిచ్చినదే సర్వస్వం నీదే
 (2)
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా
||ఎన్నిక లేని నన్ను||

మనుష్యులలో అందరికంటే అల్పుడనే నేనే
నీ కృపతో నన్నెంనుకున్నావు
 (2)
నేను నా ఇంటివారును  నీ వారమేసయ్య
నా జీవిత కాలమంతయు నిన్నే సేవిస్తామయ్యా
 (2)
యేసయ్య యేసయ్యా నీతోడు ఉంటే నాకు చాలయ్యా
యేసయ్యా యేసయ్యా నీ నీడనుంటే నాకది మేలయ్యా

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------
CREDITS : Music : Immi Johnson
Vocals : Nissi John
-------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post