3663) పూజ్యనీయుడా నా ఆరాధనకు యోగ్యుడా


** 
TELUGU LYRICS **

పూజ్యనీయుడా నా ఆరాధనకు యోగ్యుడా 
అధికస్తోత్రము పొందదగినవాడవు - 
సర్వలోకానికే చక్రవర్తివి (2)
నీ కార్యములు గంభీరములు - 
ఉహించలేనివి లెక్కకు మించి యున్నవి (2)
|| పూజ్యనీయుడా||
                                               
నా కాలు జారెనని నేననుకొనగా నీకృపయే నన్ను బలపరచు చున్నది                  
నావిచారములు అధికమవ్వగా నీగొప్ప ఆదరణ నెమ్మదిచ్చు చున్నది
 (2)
నా రక్షణ శృంగమునీవే - నీతికి ఆధారమునీవే
 (2)
నా హృదయసీమలో నీనీతిస్థాపించి
 (2)
యెడబాయని నీ కృపలో నడిపించుచున్నావు
 (2)
||నీ కార్యములు||

నా దినములు నీడవలె 
తొలగిపోవు చుండగా 
నీ దీర్ఘశాంతమే నాపై కృపచూపుచున్నది 
నా సంకటములు అధికమవ్వగా నీ గొప్ప కనికరమే స్వస్థతిచ్చు చున్నది
 (2)
నాఉన్నత దుర్గమునీవే-నా నివాసస్థలమునీవే
 (2)
నా శత్రువు దాటలేని సరిహద్దులు వేసి 
నీ దయా దాక్షణ్యము మాపై చూపితివి (2)
||నీకార్యములు||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------