** TELUGU LYRICS **
ఏ అర్హతలేని నా దీనబ్రతుకును-దీవించిన నా యేసయ్యా
ఏ విలువలేని ఈ మట్టిఘటమును-ఘనపరచిన నా రక్షకుడా (2)
గమనించినావా గతిలేని నన్ను-కరుణించి నాదు స్థితిని మార్చినావు (2)
అ.ప : ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
ఏ విలువలేని ఈ మట్టిఘటమును-ఘనపరచిన నా రక్షకుడా (2)
గమనించినావా గతిలేని నన్ను-కరుణించి నాదు స్థితిని మార్చినావు (2)
అ.ప : ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన (2)
||ఏ అర్హతలేని||
1. నేనున్న స్థితియేమో దీనాతిదీనము-బ్రతికిన బ్రతుకేమో కష్టాల కొలిమిలే
చితికిన జీవితం పగిలిన హృదయము-చీదరించబడిన ఓ ఘోరవ్యక్తిని (2)
దావీదును పిలిచినట్లు పిలిచావయ్యా (2)
శుద్ధిచేసి,బాగుపరచి కృపను చూపినావు (2)
||ఆరాధన ఆరాధన || ||ఏ అర్హతలేని||
2. నాకున్న పనియేమో లోకానుసారము-బానిస బ్రతుకులో తిరిగేవాడను
సంకెళ్ళ బంధీనై నెమ్మది కోల్పోయి-రెక్కలు విరిగిన చేతగాని పక్షిని (2)
మోషేను పిలిచినట్లు పిలిచావయ్యా (2)
వాక్కునిచ్చి, అభయమిచ్చి నీకై నడిపినావు (2)
||ఏ అర్హతలేని ||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------