** TELUGU LYRICS **
యేసువంటి ప్రియ బంధుఁడు నాకిఁక నిహ పరములలో లేఁడన్న
భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న
భాసురముగ నిజ భక్తుల కది యను భవ గోచర మెపు డగు నన్న
||యేసు||
1. ఊరు పేరు పరువులు మురువులు మరి యూడఁగొట్టబడినను గాని
కూరిమితో క్రీస్తుడు మాకుండినఁ కొదువరాదు గొప్పయు పోదు
||యేసు||
2. ఆడికలు తిరస్కారంబులు మా కవమానము లున్నన్ గాని తోడు
క్రీస్తుఁడు మాకుండినను త్రోవఁ దప్పము ఓడిపోము
||యేసు||
3. తగ్గుపాటులును సిగ్గుపాటులును దలమీఁదను వ్రాలినగాని దగ్గర మా
పాలిటఁ ప్రభువుండగ సిగ్గును బొందుము తగ్గునఁ గుందము
||యేసు||
4. ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న
తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని
4. ఎన్నెన్నో శోధన బాధలు చెల రేగి మనలఁ జుట్టిన యపుడు కన్న
తండ్రివలె నోదార్చుచుఁ దన ఘన వాగ్బలమున దునుమును వానిని
||యేసు||
5. మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన
వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును
5. మనసు క్రుంగి పలు చింతలచేత మట్టఁబడిన వేళను మాకుఁ తన
వాగ్దత్తములను జేతుల లే వనెత్తి యెంతో సంతస మొసఁగును
||యేసు||
6. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి
పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు
6. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలఁ డెప్పుడు మమ్ము ఉల్లమునెత్తి
పిలిచిన వేళ నోహో యనుచు దరికి వచ్చు
||యేసు||
7. అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ
డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము
7. అతఁ డుండని పరమండలము ఇక వెదకినగాని యగపడదు క్షతినాతఁ
డు మా మతిని వసించిన అతులిత సౌఖ్యం బదియే మోక్షము
||యేసు||
** ENGLISH LYRICS **
Yesuvanti Priya Bandhudu Naakika Niha Paramulalo Ledhanna
Bhaasuramuga Nija Bhakthula Kadhi Yanu Bhava Gochara Mepu Dagu Nanna
||Yesu||
1. Ooru Peru Paruvulu Muruvulu Mari Oodagottabadinanun Gaani
Koorimitho Kreesthudu Maakundinan Kodhuvaraadu Goppayu Podhu
||Yesu||
2. Aadikalu Thiraskaarambulu Maa Kavamaanamu Lunnan Gaani Thodu
Kreesthudu Maakundinan Throva Thappamu Oadipomu
||Yesu||
3. Thaggupaatulunu Siggupaatulunu Dhalamidhanu Vraalinagaani Dhaggara Maa
Paalita Prabhuvundaga Siggunu Bondhumu Thagguna Kundhamu
||Yesu||
4. Ennenno Shodhana Baadhalu Chela Raegi Manala Juttina Yapudu Kanna
Thandrivale Nodhaarchuchu Thana Ghana Vaagbalamuna Dhunumunu Vaanini
||Yesu||
5. Manasu Krungi Palu Chinthalachatha Mattabadina Velanu Maaku Thana
Vaagdhaththamulanu Jethula La Vaneththi Entho Santhasa Mosagunu
||Yesu||
6. Thallidhandrulu Vidichina Gaani Thaanu Vadhal Deppudu Mammu Ullamuneththi
Pilichina Vela Oaho Yanuchu Dhariki Vachchu
||Yesu||
7. Atha Dundani Paramandalamu Ika Vedhakinagaani Agapadadhu Kshathinaatha
Du Maa Mathini Vasinchina Athulitha Soukhyam Badhiyae Mokshamu
||Yesu||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------