2820) యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు

** TELUGU LYRICS **

    యేసు లేనిచో పాపికాశ్రయమే లేదు

1.  లోకము నాలుగు దినముల నటనే నికరము గాదెవరికిని
    దారిని తప్పి తిరిగెదవేల
    ఎరిగితివా నీ గురిని కడకీలోకము వదలెదవు

2.  కూర్చుకొంటివి పాపము నిలలో కాలము వ్యర్థంబాయె
    ప్రభువును నీవు మరచిపోతివి
    పాడైపోయె నీ రూపం కడకీలోకము వదలెదవు

3.  ప్రభుయేసు సిలువలో వ్రేలాడె పాపిని రక్షించుటకు
    పాట్లిపడె తనరక్తము కార్చె
    పాపపు ముల్లును విరిచె కడకీలోకము వదలెదవు

4.  ప్రేమతో క్రీస్తు నిన్ను పిలిచెను ప్రియుడా త్వరపడి రమ్ము
    ఆయన యందు నమ్మికయుంచిన
    ఆయనే నీ శరణగును కడకీలోకము వదలెదవు

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------