2819) యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను

** TELUGU LYRICS **

    యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు
    లేచెను

1.  వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ
    గానే 
    ||యేసు||

2.  సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి
    లేచె నహహ
    ||యేసు||

3.  మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని
    తెల్పి
    ||యేసు||

4.  స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము
    తొల్గ
    ||యేసు||

5.  పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద
    మొంద
    ||యేసు||

6.  యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ
    లేతురండి
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------