2785) యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు

** TELUGU LYRICS **

    యేసును స్తుతియించు వారు నిత్యజీవము నొందెదరు
    ఆనందముతో అనుదినము సంతోషముగా నుందురు

1.  వాడ బారని ఆకువలె దిన దినము బలమొందెదరు
    జీవజలపు నదియొడ్దునా - వృక్షమువలె పెరిగెదరు
    ఆ..హ... హల్లెలూయా - ఆ ..ఆ..ఆ.హల్లెలూయా 
    ||యేసు||

2.  చీకుచింతలు కలిగినను- చెరలో ధు:ఖము కలిగినను
    కనురెప్పవలె కాపాడి - యేసే విడిపించును
    ఆ..హ..హల్లెలూయ - ఆ..ఆ...ఆ...హల్లెలూయా
    ||యేసు||

3.  నడి సముద్రములో పయినించినా - నట్టడవులలో నివసించినా
    ఎన్నడు మరువక ఎడబాయక - యేసే తోడుండును
    ఆ....హ.. హల్లేలూయా - ఆ...ఆ...ఆ..హల్లేలూయ
    ||యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------