2784) యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ

** TELUGU LYRICS **

    యేసును చూచుట యెన్నటికో పర వాసుఁడ నగుట యెన్నటికో
    భాసురముగ నా పరమ జనకు సిం హాసనమున దూ తాదుల మధ్యను
    ||యేసును||

1.  బలితంబగు పైశాచక బంధన పాశము వదులుట యెన్నటికో సలలి
    తముగ నా సద్గురు పాద స్థలమున కరఁగుట యెన్నటికో 
    ||యేసును||

2.  ధాత్రిఁ గష్ట దుఃఖాబ్ధిని మన మిఁక ధాటిగ దాఁటుట యెన్నటికో
    మైత్రితోడఁ బర మాత్ముని చెంతను మనసు తీర మను టెన్నటికో 
    ||యేసును||

3.  కాంచనమకుటము కనకపు వీణెయు ఘనముగఁ దాల్చుట యెన్న టికో
    యంచితముగ హలె లూయా పాటల నానందించుట
    యెన్నటికో
    ||యేసును||

4.  శోధన బాధల నీ ధరఁ బొందక శోకము గెల్చుట యెన్నటికో సాధూత్తమ
    జన సాంగత్యమ్మున సంతస మొందుట యెన్నటికో 
    ||యేసును||

5.  నీతి రహిత పైశాచిక భటగణ నిందలు బాయుట యెన్నటికో ఖ్యాతిగ
    శ్రీ పర మాత్ముని కొలువున గట్టిగఁ గుదురుట యెన్నటికో 
    ||యేసును||

6.  జరయు వ్యాధి సంశోక మరణములు జొరని చోటుండుట యెన్న టికో
    పరిశుద్ధతయును బరమానందము ప్రబలు పదము జేరు టెన్నటికో
    ||యేసును||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------