3123) శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె

** TELUGU LYRICS **

    శరణుఁ జొచ్చితి యేసునాధుఁడ శక్తిహీనతఁ గల్గె నా దరణ మిమ్మిల
    నెవ్వఁ బొందితి దవ్వుసేయక కావవే 
    ||శరణు||

1.  కరుణఁ జూడుము కన్న తండ్రివి కల్మషం బెడఁబాపవే మరణ మొందక
    మున్ను నన్నిల మార్పు నొందఁగఁ జేయవే
    ||శరణు||

2.  మొరను జెచ్చెర నాలకించుచు మోము నా దెసఁ జూపవే యురు
    పదంబుల సేవఁ జేసెద నుద్ధరించుము కూర్మితో
    ||శరణు||

3.  తామస క్రియలందు వాంఛలు తాకకుండగఁ జేయవే క్షేమమైన సువార్త
    బోధల సిద్ధపడి విననీయవే
    ||శరణు||

4.  శ్రమలు చాల కల్గి యున్నను సైఁప నేర్పుము సత్కృపన్ గమిలి పోయెడి
    మాయ లోకపు గాంతి నీరస మంచు నీ
    ||శరణు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------