3204) సకలేంద్రియములారా చాల మీ పని దీరె నిఁక

** TELUGU LYRICS **

    సకలేంద్రియములారా చాల మీ పని దీరె నిఁక నన్ను విడిచిపోవు
    టకు వేళయ్యెన్ చకిత మృగ శాబకము పోలిక నకట మీచేఁ జిక్కి తిని
    మీ రి క దొలంగుఁడు యేసు నా ర క్షకుఁడు వచ్చెను నన్ను గావను
    ||సకలేంద్రియములారా||

1.  పంచేంద్రియములారా బల ముడిగె మీ కిపుడు వంచన సేయ మీ
    వశముగా దిఁకను మించి మీ రెదిరింపలేరు ద లఁచి చూడుఁడు దేవ
    కృపలో నుంచి ననుఁ గదలింప మీకది కొంచెమగు పని కాదు నుండి
    ||సకలేంద్రియములారా||

2.  శ్రవణేంద్రియము నీదు శక్తి తగ్గుచు వచ్చె వివిధవార్తలు దవిలి
    విను చుంటి వెంతో చెవుడు నీకిపు డనుసరించెను చేవ తణిగెను జరిగి
    పొమ్మిఁక సవినయంబుగ యేసు క్రీస్తుని శబ్ద మాలించెదను సుఖ మది
    ||సకలేంద్రియములారా||

3.  కనులారా మీ వెల్గు క్రమముగ క్షీణించె మును జూచు చూడ్కిలో
    ముసు కయ్యె నిఁకను ఘనముగల దేవుని కుమారుఁడు తన కృపాసన
    మిపుడు జూపను మనసులోపలి కన్ను విప్పెడి దినము లివె చనుదెంచెఁ
    జూడుఁడు 
    ||సకలేంద్రియములారా||

4.  రసనేంద్రియము నీ నీ రసకాల మిదె వచ్చె విసుకని మాటలనువెదజల్లి
    నావు పసఁ దరిగి ముది వైతి విపు డో రసనమా యిఁకఁ దీరె నీ పని
    వెసను నే నిపు డేసుకరుణా రసముఁ గ్రోలుచుఁ బ్రొద్దుఁ బుచ్చెద
    ||సకలేంద్రియములారా||

5.  తను వాద్యంతము మూయఁ దగిన త్వగింద్రియమా నిను సోకునట్టి వ
    న్నియు గ్రహించితివి మునుపుగల నీ జిగిబిగియు నణం గెను గదా
    వ్రేలాడెఁ దిత్తులు చనుము నీ వెందైన నేనే సుని స్వరూపముఁ దాల్ప
    బోయెద
    ||సకలేంద్రియములారా||

6.  ఘ్రాణేంద్రియమ నీవు కడు వాసనలఁ దగిలి ప్రాణానిలము చేతఁ
    బ్రబలితి విఁకను నాణెమైనవి విడును దుర్గం ధముల బాల్పడఁ బోదు విఁక
    నా త్రాణపతి యగు క్రీస్తుచేతను బ్రాణ మర్పింతును సుఖింతును
    ||సకలేంద్రియములారా||

7.  కడు దవ్వు పయనంబు నడిచి వచ్చితి నింక నిడుపు లే దా త్రోవ
    నికటమై వచ్చెన్ నడుమ నడుమ నడ్డుపడియెడ నిడుమ లన్నియు
    గడిచిపోయెను జడుతు నా మృతి నదికి నా నా వికుఁడు వచ్చెను నన్నుఁ
    గావను
    ||సకలేంద్రియములారా||

8.  వెనుకఁ దీరిన మార్గ మున కంటె ముందుండి కనుపించు నా త్రోవ
    కఠినమైన యుండు ఘన తరంగ ధ్వనుతో భీ కర మరణ నది పాఱు
    చున్నది క్షణము మాత్రమె దాని పని యా వెనుక నావలి యొడ్డు జేరెద
    ||సకలేంద్రియములారా||

9.  ఈ సంపారంబునం దేమి సౌఖ్యము గలదు ఆశ మాత్రమె గాని
    యది చిరము గాదు యేసు క్రీస్తుఁడు తండ్రి దేవుఁడు భాసురం బగు
    నిర్మలాత్మయు దాసులకు దమ దివ్య మగు కృప జేసి నిత్య నివాస
    మిత్తురు
    ||సకలేంద్రియములారా||

** ENGLISH LYRICS **

Sakalendhriyamulaaraa Chaala Mee Pani Dheere Ni-ka Nannu Vidichipovu
Thaku Velayyen Chakitha Mruga Shaabakamu Polika Nakata Meeche-n Jikkithini
Meeri Ka Dholangudu Yesu Naa Rakshakudu Vacchenu Nannu Gaavanu
||Sakalendhriyamulaaraa||

1. Panchandhriyamulaaraa Bala Mudige Mee Kipudu Vanchana Seya Mee
Vashamugaadhikanu Minchi Meeredhirimpalaeru Dhalachi Choodudu Dheva
Kruphalo Nunchi Nanu-gadhalimpa Meekadhi Konchemagu Pani Kaadhu Nundi
||Sakalendhriyamulaaraa||

2. Shravanendhriyamu Needu Shakthi Thagguchu Vacche Vividhavaarthalu Dhavili
Vinu Chunti Ventho Chevudu Neekipu Danusarinchenu Cheva Thanigenu Jarigi
Pommi-ka Savinayambuga Yesu Kreesthuni Shabda Maalinchedhanu Sukha Madhi
||Sakalendhriyamulaaraa||

3. Kanulaaraa Mee Velgu Kramamuga Ksheeninchenu Munu Joodu Choodkilo
Musu Kayye Nikanu Ghanamugala Dhevuni Kumaarudu Thana Krupaasana
Mipudu Joopanu Manasulopali Kannu Vippedi Dhinamu Live Chanudhenche-n
||Sakalendhriyamulaaraa||

4. Rasanendhriyamu Nee Nee Rasakaala Midha Vacche Visukani Maatalanu Vedhajalli
Naavu Pasa Dharigi Mudhi Vaithi Vipu Do Rasanaamaa Yi-ka Dheere Nee Pani
Vesanu Nae Nipu Dhaesukarunaa Rasamu-groluchu Broddhu-bucchedha
||Sakalendhriyamulaaraa||

5. Thanu Vaadhyanthamu Mooya Dhagina Thvagindhriyamaa Ninu Sokunatti Va
Nniyu Grahinc hithivi Munupugala Nee Jigibigiyu Nanangenu Gadhaa
Vrelaade Thitthulu Chanumu Nee Vendhaina Naenae Suni Swaroopamu Dhaalpa Boyedha
||Sakalendhriyamulaaraa||

6. Ghraanendhriyamu Neevu Kadu Vaasanalan-dhagili Praanaanilamu Chetha-n
Brabalithi Vikanu Naanemainavi Vidunu Dhurgan Dhamula Baalpadan Bodu Vika
Naa Thraanapathi Yagu Kreesthuchetha Braana Marphinthunu Sukhinthunu
||Sakalendhriyamulaaraa||

7. Kadu Dhavvu Payanambu Nadichi Vacchithi Ninka Nidupu Lae Dhaa Throva
Nikatamai Vacchen Naduma Naduma Naddupadhiyeda Niduma Lanniyu
Gadichipoyenu Jaduthu Naa Mruthi Nadhiki Naa Naavikudu Vacchenu Nannu-n Gaavanu
||Sakalendhriyamulaaraa||

8. Venuka Dheerina Maarga Muna Kante Mundhundi Kanupinchu Naa Throva
Katinamaina Yundu Ghana Tharanga Dhvanutho Bheekara Marana Nadhi Paaru
Chunnadhi Kshanamu Maathrame Dhaani Pani Yaa Venuka Naavali Yoddu Jaeredha
||Sakalendhriyamulaaraa||

9. Yee Sampaarambunam Dhaemi Soukhyamu Galadhu Aasha Maathrame Gaani
Yadhi Chiramu Gaadhu Yesu Kreesthudu Thandri Dhevudu Bhaasuram Bagu
Nirmalaathmayu Dhaasulaku Dhama Dhivya Magu Krupa Jaesi Nithya Nivaasa Mitthuru
||Sakalendhriyamulaaraa||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------