2890) రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును

** TELUGU LYRICS **

    రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
    పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది

1.  మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో
    తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను

2.  అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో
    కనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్

3.  యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను
    తన స్వాస్థ్యముగా, తన భాగముగా తన జనముగానైతిమి

4.  పర్వతములను సృజించెన్ - శ్రేష్టమైనవి నిచ్చెన్
    అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను

5.  పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్
    అలసట లేక, మము పట్టుకొని ఆకసమున నడుపును

6.  యేసుని సత్యములు - పర్వత శిఖరములు
    పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింప జేయును

7.  యేషయా ప్రవచనములు - రక్షణ వివరములు
    శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------