2957) లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ

** TELUGU LYRICS **

    లెండి లెండి మీరు క్రైస్తవులారా! దండియౌ ప్రభుండు బుట్టె
    ధరణిలో నేడు-దావీదు పురమున

1.  అవతార రూపధారుడుగా నవతరించెను - అండజేరియున్నవారి నాదరించెను
    పండియుండె పాకలోన పాపగ నేడు పాపముల బాపను 
    ||లెండి|| 

2.  ఆహా! దూత దెల్పె గొల్లలకును చల్లని వార్త - ప్రీతితోడ ప్రభుని జూడ బయలుదేరిరి 
    యాతురతతో మందలను పొలమున విడచి యావేళను వారు
    ||లెండి|| 

3.  ఆహా! తారబుట్టె నాకశమున - ఆదినంబున ఆ తారగాంచి జ్ఞానులంత తరలి వెళ్లిరి 
    బోళము బంగారములను బాలయేసుకు అర్పించిరి నాడు
    ||లెండి|| 

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------