2958) లెండీ రండీ భావిమహోన్నత సాక్షులారా లెండీ

** TELUGU LYRICS **

    లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ

1.  యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలే
    తరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా

2.  మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువు
    మహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము

3.  మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయె
    సిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె

4.  నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా
    శరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా

5.  లోకాశల విడచి శుభప్రద నిరీక్షణతో
    క్రీస్తు మహిమ ప్రత్యక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------