2181) ప్రేమామృత ధారల చిందిన మన యేసుకు సమమెవరు?

** TELUGU LYRICS **

1.  ప్రేమామృత ధారల చిందిన మన - యేసుకు సమమెవరు?
    ప్రేమయె తానై నిలచి - ప్రేమోక్తులనె పల్కి
    ప్రేమతో ప్రాణముబెట్టి - ప్రేమగరికి చనియె

2.  నిశ్చలమైన ప్రేమ జీవికి - ఇలలో తావేది
    ప్రేమద్రోహులేగాని - ప్రియమున జేరరు వాని
    చేరిన చెలికాడగురా - సమయమిదే పరుగిడిరా

3.  ఎంత ఘోరపాపాత్ములనైన - ప్రేమించును రారా
    పాపభారముతో రారా - పాదములపై బడరా
    పాపుల రక్షకుడేసు - తప్పక నిను రక్షించు

4.  ఇంత గొప్ప రక్షణను - నిర్లక్ష్యము చేసెద వేల
    రక్షణ దిన మిదియేరా - తక్షణమే కనుగొనరా
    ఇదియే దేవుని వరము - ముదమారగ చేకొనుము

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------