** TELUGU LYRICS **
ప్రభుయేసు నాకై సర్వము నిచ్చితివి
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై
ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై
1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకే
సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ
సహింపజాలని వేదన బహుగా సహించితివి ప్రేమతోడ
2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచి
కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి
కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి
3. కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెను
శరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా
శరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా
4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి
యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి
యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి
5. ప్రాయశ్చింత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకు
పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను
పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను
6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందు కింతగా ప్రేమించితివి
వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి
వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి
7. నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకు
నీతోడ నిరతం నేనుండునట్లు నీ యధికారం బిచ్చితివి
నీతోడ నిరతం నేనుండునట్లు నీ యధికారం బిచ్చితివి
** ENGLISH LYRICS **
Prabhuyesu Naakai Sarvamu Nichchithivi
Premanubatti Arpinchu Kontivi Naakai
1. Shirassu Nichchithivi Mundla Makutamukai - Swaami Naa Paapamula Korakae
Sahimpajaalani Vedhana Bahugaa Sahinchithivi Premathoda
2. Kannula Nichchithivi Kanneeru Kaarcha - Karuninchi Naa Sthithini Joochi
Karige Nee Hrudhayam Duhkhambuthoda - Kadu Vedhanatho Yaedchithivi
3. Koradaa Debbalachae Nee Dhehamantha - Chaaraluga Dunnabadenu
Shareeramantha Rakthamayamaayenu - Varadha! Gaayamu Londhithivaa
4. Kaallu Chethulalo Maekulu Gottiri - Ballemutho Prakkan Bodichiri
Yaelaagu Vivarinthu Nee Baadha Naenu - Oarchithivaa Mounamu Vahinchi
5. Praayashchinthambai Poathivaa Naakai - Paapamu Nundi Vidipinchutaku
Pondhithi Nentho Goppa Rakshananu - Pashchaaththaapamu Dwaaraa Naenu
6. Entha Adhbhuthamu Prabhuvaa Nee Prema - Endhu Kinthagaa Preminchithivi
Vandhana Marpinthu Nee Paadhamulakae - Ponduga Nee Vaadanaithi
7. Naa Yedala Needu Sankalpamaegaa - Nee Swaasthya Manubhavinchutaku
Neethoda Niratham Naenundunatlu Nee Yadhikaaram Bichchithivi
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------