2024) ప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము

** TELUGU LYRICS **

    ప్రభు యేసునకే జయము
    సిలువశక్తిచే జయము - జై జై జై జై

1.  యేసుని రక్తము జయమునిచ్చున్
    సైతాను సేనలపై జయము

2.  సిలువే మనకు జయమిచ్చున్
    పాత స్వభావముపై జయము

3.  పునరుత్థానుడు జయమిచ్చున్
    పాపమరణములపై జయము

4.  ఇహలోకముపై జయమిచ్చున్
    తన జీవముతో జయమిచ్చున్

5.  ఆత్మద్వారా జయమొసగున్
    శరీర యిచ్ఛలపై జయము

6.  తనప్రేమ మన కొసగు జయం
    దుఃఖ సంకటములపై జయము

7.  రాజుల రాజు జయమిచ్చున్
    సర్వ శత్రులపై జయమిచ్చున్

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------