2023) ప్రభు యేసుకే జయమని పాడు

** TELUGU LYRICS **

    ప్రభు యేసుకే జయమని పాడు
    పాప పరిహారమును బొంది

1.  యేసు ప్రభువే మా ప్రియుండు
    వాసిగా మనదు రక్షకుడు
    ఆయనే మన హృదయేశ్వరుడు
    హృదయ ద్వారము తెరువుము

2.  మన పాప శిక్ష భరించి
    తన రక్తమును కార్చెను
    చక్కని మార్గము జూపెను
    ఇంకను నిలువకు పాపములో

3.  పాపముచే బంధింపబడి
    పాపములో నిలువగ నేల
    యేసు నిను విడిపించును
    రక్షణార్థ సువార్తయిదే

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------