2022) ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు

** TELUGU LYRICS **

    ప్రభు యేసుక్రీస్తుని దర్శనమే నేడు
    ప్రజలందరి కత్యవసరము ఆ ఆ
    అను పల్లవి: దర్శనము లేక ప్రజలు నశింతురు
    దీనినక్కరతో గమనించెదము

1.  యెషయాచూచె సైన్యముల యెహోవాను
    ఉజ్జియా మరణించినపుడు ఆ ఆ
    యెహోవా పరిశుద్ధుడని ముమ్మారు
    దూతల గొప్ప ద్వని వినెనపుడు

2.  యెహెజ్కేలుకు అధిపతివలె కనబడె
    నా భాగ్యమెవరికి లేదా ఆ ఆ
    నాళు ముఖములతో నాలుగు జీవులు
    కన్నులతో నిండియున్న చక్రములు

3.  శాశ్వత రాజ్యములు కల్గిన రాజును
    అగ్నివంటి సింహాసనమున్ ఆ ఆ
    కోట్లకొలది జనులు తీర్పునకై
    కాచియుండుట చూచెను దానియేలు

4.  కొండపై యేసు రూపాంతర మొందిన
    సందర్భము మరువగలమా ఆ ఆ
    భయ మొందిరచ్చట ముగ్గురు శిష్యుల్
    ప్రియసుతుని గూర్చి తండ్రి జెప్పగనె

5.  పత్మాసు ద్వీపమున యోహానుజూచిన
    ప్రభువే సంఘమునకు శిరస్సు ఆ ఆ
    మహా ప్రధాన యాజకుడాయనే
    మహిమ ప్రభావ రూపుడు యేసే

6.  సిణాసనము మధ్యలో నున్నవాడే
    సింహమగు దైవ గొఱ్ఱెపిల్ల ఆ ఆ
    ఆరాధింపబడు దేవుడు నాయనే
    అందరి యారాధన లాయనకే

7.  తెల్లని యశ్వముపై నున్న వీరుడు
    నమ్మకమగు సత్యరూపి ఆ ఆ
    దేవుని వాక్యము న్యాయాధీపతియగు
    జీవుల దేవునికే హల్లెలూయ

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------