2021) ప్రభు యేసు క్రీస్తు జన్మించే పరిపూర్ణ తేజముతో

** TELUGU LYRICS **

ప్రభు యేసు క్రీస్తు జన్మించే 
పరిపూర్ణ తేజముతో లోకానికి ఇదియే పర్వదినం 
ఇదియే మహోదయం (2)
పరిశుధుడు పరమాత్ముడు సత్యా సంపూర్ణుడై
పరలోక మార్గము చూపుటకు
తన ప్రేమను తెలుపుటకు 
||ప్రభు యేసు||

పాపులకై పరమును విడచి 
నరరూపధారునిగా 
పశువుల శాలలో మరియ సుతునిగా ఆయన పవళించే (2)
దూతలు తెల్ప ఆ వార్తను విని ఆ గొర్రెల కాపరులు
అడుగో ప్రభు అని కని ఆరాధించిరి
||ప్రభు యేసు||

తూరుపు తారలు కనుగోనినా - ఆ ముగ్గురు జ్ఞానులు ఓర్పున సాగి
అద్భుత కరుడగు యేసును దర్శించి (2)
భక్తితో మ్రొక్కి  కానుకలిచ్చి - బహు సంతోశించగా మనము
ఇది విని ప్రభుని ఆరాధింతుము
||ప్రభు యేసు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------