1685) నీతోనే నడిచెదనయ్యా నీతోనే సాగెదనయ్యా

** TELUGU LYRICS **

నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
కన్నీటి సముద్రాన మునిగియున్నా
ఏ తోడు లేక తిరుగుచున్నా
నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా
మిగిలున్న ఒక్క ఆశ నీవేనయ్యా
అనాధుల దైవము నీవేకద దేవా
నా చేయి విడువను అంటివి కద దేవా
నను దాటి పోకుము దేవా
నా చేయి విడువకు దేవా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా
ఎదురు గాలులే నాపై వీచినా
జీవిత అలలే నన్ను ముంచినా
నీతోనే నడిచెదనయ్యా
నీతోనే సాగెదనయ్యా

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------