2433) మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు

** TELUGU LYRICS **

    మానవుల మేలు కొరకు జ్ఞానియైన దేవుఁడు మానుగఁ కల్యాణ పద్ధతి
    మహిని నిర్ణయించెగా 
    ||మానవుల||

1.  కానాయను నూరిలో మన కర్త చూచెఁ బెండ్లిని పానముగను ద్రాక్షరసము
    దాన మొసఁగెఁ బ్రీతిని
    ||మానవుల||

2.  యేసూ వీరిద్దరిని ఏకముగాఁ జేయుమీ దాసులుగను జేసి వీరి దోసము
    లెడబాపుమీ
    ||మానవుల||

3.  కర్త వీరలకు భార్య భర్తల ప్రేమంబును బూర్తిగ నీ విచ్చి వీరిఁ బొందుగాను
    నడుపుమీ
    ||మానవుల||

4.  భక్తియు విశ్వాస ప్రేమలు భావమందు వ్రాయుమీ ముక్తి సరణి వెదక
    వీరి భక్తి మిగులఁ జేయుఁమీ
    ||మానవుల||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------