482) ఏది నా విశ్రాంతి యీ లోకమందు

** TELUGU LYRICS **

    ఏది నా విశ్రాంతి యీ లోకమందు నే దిక్కు గనుఁగొన్న లేదు సుఖ
    మెందు మేదురా మోద ని త్యోదగ్ర మోక్ష పుట భేదమున
    చొరకున్న లేదు సుఖ మెచట 
    ||ఏది||

1.  కష్టములు తెరతెరలు గా వచ్చిన మదాత్మ దృష్టి దప్పక యోర్చి
    తీరమంద వలయున్ స్పష్టమగు నా త్రోవ పయనంబు తుద ముట్టు
    శ్రేష్ఠ మగు నా యిల్లు చేరు నందాక
    ||ఏది||

2.  కోరింద పొదచుట్టు కొనియుండ నిమ్ము నేఁ గోర నిచట గులాబి
    కుసుమ శయనంబు నేరీతినైన నా యేసు రొమ్మునఁ జేరి భూరిసుఖ
    మొందెద వి చార మిఁక నేల
    ||ఏది||

3.  యేసుప్రియ మించు కే నెఱిఁగి కన్గొను వేళ నా సంతసము నిండు
    పాసి చనె వెతలు భాసురంబుగ మంచు పగిదిఁ దళ తళలాడఁ జేసె నా
    కన్నీళ్లు చింత లెడఁబాపి
    ||ఏది||

4.  ఉండునే సందియము లుండునే దుఃఖములు గండములు ఢీయను చు
    బైకి రాఁ గలవే మెండుగా మధురమై యుండు మోక్షము నాకుఁ
    దండ్రితో గడియ సే పుండిననుఁ జాలు
    ||ఏది||

5.  నడుము పై నొక సంచి బడెకఱ్ఱ చేతిలో నిడికొనుచు శత్రువుల
    పుడమి వే గడుతున్ నడుదారి కరుకు నె న్నక వేగ రక్షింపఁ బదుదునని
    పాడి చని పరమసుఖి నౌదు
    ||ఏది||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------