481) ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన

** TELUGU LYRICS **

    ఏ దేశస్థులమైన ఏ జాతి మనదైన యేసులో మన మొక్కటే ఏకమై
    బాలల మెల్లరమును తండ్రి నెంతో స్తుతించుచు నెప్పుడు బాడుదము 
    ||ఏ||

1.  పలు దేశములలోన పన్నుగ దేవుని ప్రార్ధించెడి బాలలం పరమ తండ్రీ
    మాలో ప్రతివారి దీవించు బహుగా నీ దినమనుచు బ్రతిమాలి వేడుదము
    ||ఏ||

2.  బహు దేశములలోన పలువిధుములగు పనులు పరగజేసెడి బాలలం
    ప్రభుడే యేసుని కొఱకే ప్రపంచమంతటిని బాగుచేయను మిగుల
    ప్రయాసపడుదము
    ||ఏ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------