368) ఊహలకందనిది నీ త్యాగం వర్ణింపజాలనిది


** TELUGU LYRICS **

ఊహలకందనిది నీ త్యాగం - వర్ణింపజాలనిది 
ఊసులకందనిది నీ యాగం - వివరింపజాలనిది 
నీ కొరకే ఆ త్యాగం - మన కొరకే బలియాగం 
ఎంత ప్రేమయ్యా యేసు - వింత ప్రేమయ్యా (2)
||ఊహల||

ఎవరూ చూపని నీ ప్రేమ - నాకై చూపిన నా 
ఎవరూ చేయని ఆ త్యాగం - నాకై చేసిన నా ప్రభువా 
ఏమని వర్ణింతును - ఏమని వివరింతును 
నీ గొప్ప త్యాగాన్ని యేసు - ఆ గొప్ప యాగాన్ని (2) 
||ఊహల||

నాలో మంచి లేదనియు - తెలిసి తనయునిగా పిలచి 
ఎంచలేని మంచిని - నాలో పెంచాలని యెంచి 
యాగమై బలియాగమై - త్యాగమై ప్రాణ త్యాగమై 
నాకై మరణించినా యేసు - నన్ను బ్రతికించినా (2) 
||ఊహల||

-------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Ninne nammukunnanaya (నిన్నే నమ్ముకున్నానయ్యా)
-------------------------------------------------------------------------------------