** TELUGU LYRICS **
ఇడుగో గొఱ్ఱెలకాపరి సోదరులారా యిడుగో గొఱ్ఱెలకాపరి కడగానరాని
కారడవిలో నలసట పడెడు గొఱ్ఱెలను పేరిడిబిల్చి రక్షించు

||ఇడుగో||
1. చెదిరిపోయిన గొఱ్ఱెనై దొడ్డికిఁబోవ ముదములేనివాడనై
మృదుమధురంపు నీ నాదమా లించక కర్త కొదిఁగి యుండక మూఢ
హృదయుఁడనైతి
మృదుమధురంపు నీ నాదమా లించక కర్త కొదిఁగి యుండక మూఢ
హృదయుఁడనైతి
||ఇడుగో||
2. దూరంబునకుఁబోతిని జనకుని కృపా సారంబుఁ గొననైతిని కారు
మూర్ఖపుపిల్ల గా సంచరించినా కూరిమి యిలుఁబాసి దారి దొలగిపోతి
||ఇడుగో||
3. తనదు గొఱ్ఱెను జూచెను బోయఁడు తండ్రి తనశిశువును గాంచెను
కనికరమెదలో నిం డినవారలై నన్ను వన గిరికటకాదు లను వెంబడించిరి
||ఇడుగో||
4. ప్రాణావసర మప్పుడు యేకాకినై క్షీణించియున్నప్పుడు త్రాణార్థమగు
నెనరు త్రాళ్లతో ననుగట్టి నాణెంబుగా(దెచ్చి నన్ను రక్షించెను

5. చెడుగు మెకములవల్లను బాధలనొంది కడుమలినమై యుండను
కడిగి గాయములన్ని గట్టి శుభ్రముచేసి తడయక నాయింట నిడి
నెమ్మది యొసంగె

6. ప్రభుయేసు నా బోయఁడు యీతఁడె భూమి నభము లేలెడి రాయఁ
డు శుభమైన తనదివ్య శోణిత మొసఁగియ వ్విభుఁడు ప్రేమించి దీ
వించి స్వస్థముఁజేసె

7. నన్ను దొడ్డిని బెట్టెను పోయినగొఱ్ఱె తెన్ను వెదకిపట్టెను సన్నంపు
పచ్చిక యున్ను జీవనపూట లున్నుఁ గల్గెడిచోట్ల నన్నుంచి రక్షించె
||ఇడుగో||
8. నేను మూర్ఖపుగొఱ్ఱెనై లోబడకుంటి మానసమున వెర్రినై పూని
యిప్పుడు కాచే వాని శబ్దము ప్రేమ తో నాలింపుచు దొడ్డి
నానందముననుందు

9. చెడ్డబిడ్డనై యుంటిని యిటునటుబోవ నెడ్డెతనముఁ గొంటిని
మెడ్డులేకిపుడు ప్రే మింతు నా ప్రియజనకు దొడ్డ శబ్దము వాంఛిం
తును ముక్తి నిలయంబు

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :