260) ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు

** TELUGU LYRICS **    

    ఇందులేదు నిలుచు పట్టణం క్రీస్తు యాత్రికులకు నిందు లేదు నిలుచు
    పట్టణం 
    ||ఇందులేదు||

1.  పాదుకొన్న లౌకికునకు బహుళదుఃఖ మిది మఱి సొం పై దగు మేల్
    చోటు వెదకు భక్తుఁడ వెత నొంద కెప్పు
    ||ఇందులేదు||

2.  మాకు నిల్లి దైన దుఃఖ మౌకదా వచ్చు పురము దాకొనంగ వెదకె దము
    ధైర్య మిచ్చు నిదియె మాకు
    ||ఇందులేదు||

3.  మనము యాత్ర వారి వలెనే ఘనత విశ్రమంబులేక కినుక నీలోక
    మునను గ్రింది వన్ని వదలు దాము
    ||ఇందులేదు||

4.  మిగుల యాత్ర పరులవిశ్ర మించు సౌఖ్య వాసమా ఖగము వలెనే టెక్కలున్న
    నెగిరి నిన్నుఁ జేరుకొందు
    ||ఇందులేదు||

5. సద్దు నాయాత్మ నణంగ వద్దు తగిన వేళగామి యొద్ది కతని తలఁపు
    జేతుఁ నొసఁగు విశ్రమం బతండె
    ||ఇందులేదు||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------

No comments:

Post a Comment

Do leave your valuable comments