1303) దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా

** TELUGU LYRICS **

    దొరకుతావురా సహోదరా! దొరుకుతావురా, నీవు
    తరిమి తరిమి కీడుచేయ పరుగులెత్తినగాని తుదకు 
    ||దొరకుతావురా||

1.  చిన్న చూపు చూచి తమ్ముని కన్నెఱుంగక చంపినగాని
    అన్న కయీను దేవుని హస్తమునకు దొరికిన రీతిగా 
    ||దొరకుతావురా||

2.  వరములొందిన తమ్ముని జంప వలయునని పంతముగబట్టి
    నరకవచ్చిలోబడి యేడ్చిన దురిత చరితుని యేశావువలె 
    ||దొరకుతావురా||

3.  భక్త దావీదును బట్టి ప్రాణము దీయగ దలచిన తన
    శక్తితో తరిమిన రాజగు సౌలు దొరికినరీతిగాను 
    ||దొరకుతావురా||

4.  విగ్రహమునకు మ్రొక్కని దైవ పిల్లల నగ్నిలోపడవైచి
    ఆగ్రహించిన నెబుకద్నెజరు గడ్డిమోసి దొరికిన విధముగ 
    ||దొరకుతావురా||

5.  క్రైస్తవులను బట్టి కొట్టి ఖైదులో వేయదలచినను
    వాస్తవమగు వెలుగును జూచి ప్రభుని చాటిని పౌలుబోలి 
    ||దొరకుతావురా||

6.  కీడుచేయబోకు మెపుడు కీడు నీకే కీడు కీడు
    కీడు చేసినమేలుచేసి కీడును జయింపకపోతే 
    ||దొరకుతావురా||

7.  మాటలు కుదిరితే మాటలు కోటలు కుదురును నీకు
    మాటలలో లోటుంటే నోటిమాట తప్పకుండ
    ||దొరకుతావురా||

8.  దొంగతనము వ్యభిచారమునకు లొంగి శాపగ్రస్తులునై
    దొంగిలించిన దశమభాగమే లొంగుట కారణమని తుదకు
    ||దొరకుతావురా||

9.  కొంతయిచ్చిన దశభాగ మంత యిదియని తప్పుకున్న
    కొంతయిచ్చిన కయీనువలె కొంతయిచ్చిన అననియవలె
    ||దొరకుతావురా||

10. చెడుగుచేసి బదులు దానిని చేసినారని చెప్పమన్న వడిగ
     దేవుని న్యాయమనెడి పరమత్రాసులో నిలువండి
    ||దొరకుతావురా||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------