1302) దైవప్రేమ మనలనెపుడు బంధించుగా

** TELUGU LYRICS **

    దైవప్రేమ మనలనెపుడు బంధించుగా దివిని భువిని దీన జనులను
    దిరముగా కాపాడుగా 
    ||దైవ||

1.  పరమతండ్రి గద్దెముందట ప్రార్థనల్ మరిజేతుము పలు విధముల
    మార్గములలో ప్రభువే తోడైయుండుగా
    ||దైవ||

2.  నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము నిలిచియుందుము
    క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా
    ||దైవ||

3.  మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్గును వేదన మనసు హృదయము
    కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో
    ||దైవ||

4.  జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు ఆదినుండి
    యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా
    ||దైవ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------