** TELUGU LYRICS **
దాహముగల వారెల్లరు - నీళ్ళయొద్దకు రారండి
1. దేవుని నది నీళ్ళతో నిండి - భువికి సారము నిచ్చుచున్నది - రారండి
దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు
దేవుని దీవెనల వలన నీవు తృప్తి పొందెదవు
2. ఆనంద ప్రవాహ నదిలో - పానముతో దప్పి తీర్చును రారండి
భూనివాసులు దాహముతో - ప్రాణము విడుచుచున్నారు
భూనివాసులు దాహముతో - ప్రాణము విడుచుచున్నారు
3. మంచితనముతో వత్సరమునకు మకుటము ధరింప చేసెను - రారండి
మహిమతో నిండిన తన మార్గములో - మేలులు ప్రవహింప జేసెను
మహిమతో నిండిన తన మార్గములో - మేలులు ప్రవహింప జేసెను
4. ప్రయాసభారము మోయువారు - యేసు నొద్దకు ఆశతోడను - రారండి
తీసివేయును మీ భారము - నొసగు మీకు విశ్రాంతి
తీసివేయును మీ భారము - నొసగు మీకు విశ్రాంతి
5. సకలము సిద్ధముగా నున్నది - శక్తిగల దేవుని విందునకు - రారండి
సహవాసంబున భుజించును - చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని
సహవాసంబున భుజించును - చేర్చుకొనిన క్రీస్తు ప్రభుని
6. సత్యమును తెలిపెను ప్రభువు - ప్రత్యేక జీవము జీవింపను - రారండి
ప్రత్యక్ష పరచెను తన వెలుగు - నిత్యము యేసుతో జీవించుడి
ప్రత్యక్ష పరచెను తన వెలుగు - నిత్యము యేసుతో జీవించుడి
7. దేవుని నది జీవజల నది - ప్రవహించుచున్నది పల్లమునకు - రారండి
దేవుని కృప పూర్ణతను బొందగ - నీవును విధేయుడవై యుండుము
దేవుని కృప పూర్ణతను బొందగ - నీవును విధేయుడవై యుండుము
** ENGLISH LYRICS **
Daahamugala Vaarellaru - Neellayoddhaku Raarandi
1. Devuni Nadhi Neellatho Nindi - Bhuviki Saaramu Nichchuchunnadhi - Raarandi
Devuni Deevenala Valana Neevu Thrupthi Pondhedhavu
2. Aanandha Pravaaha Nadhilo - Paanamutho Dappi Theerchunu Raarandi
Bhoonivaasulu Daahamutho - Praanamu Viduchuchunnaaru
3. Manchithanamutho Vathsaramunaku Makutamu Dharimpa Chesenu - Raarandi
Mahimatho Nindina Thana Maargamulo - Melulu Pravahimpa Jesenu
4. Prayaasabhaaramu Moyuvaaru - Yesu Noddhaku Aashathodanu - Raarandi
Theesiveyunu Mee Bhaaramu - Nosagu Meeku Vishraanthi
5. Sakalamu Siddhamugaa Nunnadhi - Shakthigala Devuni Vindhunaku - Raarandi
Sahavaasambuna Bhujinchunu - Cherchukonina Kreestu Prabhuni
6. Sathyamunu Telipenu Prabhuvu - Prathyeka Jeevamu Jeevimpanu - Raarandi
Prathyaksha Parachenu Thana Velugu - Nithyamu Yesutho Jeevinchudi
7. Devuni Nadhi Jeevajala Nadhi - Pravahinchuchunnadhi Pallamunaku - Raarandi
Devuni Krupa Poornathanu Bondhaga - Neevunu Vidheyudavai Yundumu
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------