1148) దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి

** TELUGU LYRICS **

    దిక్కులేని వాఁడనో ప్రభో నీ యండజేరి మ్రొక్కి సేవఁజేతు నో ప్రభో
    మ్రొక్కి విన్నవించు వారి యక్కరలను దీర్చు సత్యము గ్రక్కున నిడి
    యాదరించు మక్కువైన దేవ తనయ 
    ||దిక్కులేని||

1.  ఘోర పాప భరము నెల్లను మోయుచు నలయు వారలార రండటంచును
    భూరి దయను బిలిచి యున్న సార వాక్కు లెఱుఁగ కధిక భార మొంది
    తుదిని నీ దరిఁ జేరితి నన్నాదరించుము
    ||దిక్కులేని||

2.  బలము లేని వాఁడనో ప్రభో కేవలము పాప ములను జేసి యలసితిని
    ప్రభో ఇలను నే నొనర్చునట్టి కలుష జాలములను నీవు తొలఁగ జేసి
    యాత్మ కధిక బలము నొసగి మునుపు మయ్య
    ||దిక్కులేని||

3.  పామరుండ నౌట వల్లను నే నెఱుఁగనైతి క్షేమ మిచ్చు పదవులెల్లను
    కామ క్రోధ లోభములను దీమసమున విడిచి యేసు నామ మందు
    విశ్వసించి ప్రేమను వర్తింపజేయు
    ||దిక్కులేని||

4.  వందనం బొనర్తునో ప్రభో నా డెందమందలి సందియము లణంచు
    మో ప్రభో సందియ మెడబాపి శాస్త్ర మందు నుండు సార వాక్యానంద
    పదవు లనుభవింప డెందము వెలిఁగింప వయ్య
    ||దిక్కులేని||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------