1185) దేవ నీవు నన్ను బరిశోధించి బాగుగఁ దెలిసికొంటివి

** TELUGU LYRICS **

    దేవ నీవు నన్ను బరిశోధించి బాగుగఁ దెలిసికొంటివి నీ వెఱుఁగు
    దువు నేను కూర్చుండుటయును నే లేచుటయును 
    ||దేవ||

1.  నాకుఁ దలఁపులు పుట్టినపుడే నా మనస్సు గ్రహించి నాఁడవు
    ప్రాకటంబుగ నా నడక నా పడకను బరిశీలించితి
    ||దేవ||

2.  నీకు నా సమస్త చర్యల నిజము తెలియును, మాట నాల్కకు రాకపూర్వము
    దేవ సర్వముఁ బూర్తిగా నీకే తెలియును
    ||దేవ||

3.  నా వెనుకను ముందు నుండి నన్ను నావరిఁచి నీ చెయ్యి నీవు నాపయి
    నుంచితివి నా మది కది కేవల మందదు
    ||దేవ||

4.  అరుగుదెంచెద నెచ్చటికి నీ యాత్మ యొద్ద నుండి యింక నీ పరమ
    సన్నిధి నుండి నే నెచ్చోటికిఁ బారిపోవుదు
    ||దేవ||

5.  ఏను వేకువ టెక్కలను ధరి యించి కడలిలో నున్న నీ చెయి మానక
    నడిపించు నీ కుడి చేయియు మరి నను గైకొను
    ||దేవ||

6.  నను సృజించిన తెఱఁగెఱుంగఁగ నాకు భయ మాశ్చర్య మొదవును
    గనుక నీకును నేఁ గృతజ్ఞతాస్తుతులను జెల్లింతును
    ||దేవ||

7.  నేను పిండం బైనయప్పుడు నీవు నను వీ క్షించినాఁడవు నేను బ్రతుకుట
    ముందె లిఖితంబాయెను నీ గ్రంథంబులో
    ||దేవ||

8.  నిక్కముగ దేవా నీ తలఁపు లెక్కువ ప్రియ మగును నాకును లెక్కకు
    నెక్కువౌ
    ||దేవ||

** ENGLISH LYRICS **

Deva Neevu Nannu Parishodhinchi Baaguga Dhelisikontivi Nee Verugu
Dhuvu Nenu Koorchundutayunu Ne Lechu-tayunu
||Deva||

1. Naaku Thalampulu Puttinapude Naa Manassu Grahinchi Naadavu
Praakatambuga Naa Nadaka Naa Padakanu Parishilinchithi
||Deva||

2. Neeku Naa Samastha Charyala Nijamu Teliyunu Maata Naalkaku Raakappurvamu
Deva Sarvamu Poorthigaa Neeke Teliyunu
||Deva||

3. Naa Venukanu Mundhu Nundi Nannu Naavarinchi Nee Cheyyi Neevu Naapai
Unchithivi Naa Madhi Kadhi Kevala Mandhadu
||Deva||

4. Arugudhencheda Nechchatiki Nee Aathma Yoddha Nundi Inka Nee Parama
Sannidhi Nundi Ne Nechchotiki Paaripovudhu
||Deva||

5. Enu Vekuva Tekkalanu Dhariyinchi Kadalilo Unna Nee Cheyi Maanaka
Nadipinchu Nee Kudi Cheyiyu Mari Nanu Gaikonu
||Deva||

6. Nanu Srujinchina Therangerungaga Naaku Bhaya Maashcharya Modhavunu
Ganuka Neekunu Ne Kruthagnathasthuthulanu Jellinthunu
||Deva||

7. Nenu Pindam Bainayappudu Neevu Nanu Veekshinchinaadavu Nenu Brathukuta
Mundhe Likhithambayenu Nee Granthambulo
||Deva||

8. Nikkamuga Deva Nee Thalampu Lekkuva Priya Magunu Naakunu Lekkaku
Nekkuvau
||Deva||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------