6129) కృపగల యేసయ్య రక్షించినావయ్యా నీ కృపలేనిదే ఒక క్షణమైనా ఊహించలేనయా లిరిక్స్ | Krupagala Yesayya Rakshinchinaavayya Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

కృపగల యేసయ్య రక్షించినావయ్యా 
నీ కృపలేనిదే ఒక క్షణమైనా ఊహించలేనయా (2)
అ ప: నీ కృప లేనిదే నేను బ్రతుకలేనాయా 
నీ కృప నాతో ఉంటే అంతే చాలయా (2)

1. నేనూ క్షేమముగా ఉండుటకు కారణం
కేవలం నీదు కృప మాత్రమే
ప్రమాదాలు ఎన్నో తప్పించినది 
కేవలం నీదు కృప మాత్రమే
నాలో ఏమీ లేదయా
యోగ్యతా అసలే కాదయా 
కృపయే కృపయే నీ కృపయే (2)
||నీ కృప లేనిదే||

2. నే ఆరోగ్యముగా ఉండుటకు కారణం 
కేవలం నీదు కృప మాత్రమే
వ్యాధి బాధలలో తోడై ఉండినది 
కేవలం నీదు కృప మాత్రమే
నా బలమూ ఏమీ లేదయా 
బంధుబలగమూ కానే కాదయా 
కృపయే కృపయే నీ కృపయే (2)
||నీ కృప లేనిదే||

3. నేను నీ సేవలో ఉండుటకు కారణం 
కేవలం నీదు కృప మాత్రమే
ఎన్నో శోధనలు నను కృంగదీసినా 
ఘనపరిచినది నీదు కృప మాత్రమే
అర్హత నాకు లేదయా 
అభిషేకం నీదేనయా 
కృపయే కృపయే నీ కృపయే (2)
||నీ కృప లేనిదే||

** ENGLISH LYRICS **

Krupagala Yesayya Rakshinchinaavayya 
Nee Krupalenide Oka Kshanamainaa Oohinchalenaya (2)
Anupallavi: Nee Krupa Lenide Nenu Brathukalenayaa
Nee Krupa Naatho Umte Anthe Chaalaya (2)

1. Nenu Kshemamugaa Undutaku Kaaranam
Kevalam Needu Krupa Maathrame
Pramaadaalu Enno Thappinchinadi 
Kevalam Needu Krupa Maathrame
Naalo Eemi Ledayaa
Yogyathaa Asale Kaadayaa 
Krupaye Krupaye Nee Krupaye (2)
||Nee Krupa Lenide||

2. Nene Aarogyamugaa Undutaku Kaaranam 
Kevalam Needu Krupa Maathrame
Vyaadhi Baadhalalo Thodai Undinadi 
Kevalam Needu Krupa Maathrame
Naa Balamu Eemi Ledayaa 
Bandhubalagamoo Kaane Kaadayaa 
Krupaye Krupaye Nee Krupaye (2)
||Nee Krupa Lenide||

3. Nenu Nee Sevalo Undutaku Kaaranam 
Kevalam Needu Krupa Maathrame
Enno Shodhanalu Nanu Krungadeesinaa 
Ghanaparachinadi Needu Krupa Maathrame
Arhatha Naaku Ledayaa 
Abhishekam Needanayaa 
Krupaye Krupaye Nee Krupaye (2)
||Nee Krupa Lenide||

-------------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Lyrics, Tune : Blessy Kingsley
Vocals : Jessica Blessy Munganda
-----------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post