6090) యవ్వనుడా ఓ యవ్వనుడా నీ దేహము దేవుని ఆలయం లిరిక్స్ | Yavanuda O Yavanuda Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

యవ్వనుడా ఓ యవ్వనుడా నీ దేహము దేవుని ఆలయం 
యవ్వనుడా ఓ యవ్వనుడా నీ కళ్ళే దేహానికి దీపము (2)
నీ కళ్ళే తేట్తేతే నీ దేహం పరిశుద్ధమే
నీ చూపులు మొహమైతే ఆ పాపమే నిన్ను ఏలునే 
మోసపోకు మోసపోకు ఓ యవ్వనుడా 
ఈ లోక అందచందాలేవీ శాశ్వతం కాదురా 
||యవ్వనుడా||

1. సొలోమోను జ్ఞానము సంసోను బలము
కాపాడలేదుగా వారి యవ్వన పాపము (2)
దేవుడు ఇచ్చే బహుమానం ప్రతి మనిషికి యవ్వనం 
లోక ఆశకు లొంగిపోయి చేస్తే నీవు పాపము 
మరణించిన మరు క్షణమే జీవితం కాలే నరకము
మోషే లాంటి నమ్మకం యోసేపు లాంటి పరిమళం 
క్రీస్తులో ప్రతిదినం వెదజల్లాలి సోదరా 
||యవ్వనుడా||

2. దుష్టుడు యవ్వన వాంఛలతో నీకు వలనే వేయగా 
వాక్యమనే ఈ ఖడ్గముతో తరిమి తరిమి కొట్టరా (2)
కాయలు కాసిన చెట్టుకే తగులును రాళ్ల దెబ్బలు
భక్తిగా ఉన్న వారికే సాతాను పెట్టును శోధనలు
యుద్ధమందు సైనికుడు వెనుక తట్టు చూచునా
శత్రువులతో చివరిదాకా పోరాడుట మానునా 
రెండంచుల ఖడ్గమే వాక్యమనే మన కవచము 
క్రీస్తు రక్తమే పాపములకు ప్రాయశ్చిత్తము సోదరా 
||యవ్వనుడా||

** ENGLISH LYRICS **

Yavanudaa O Yavanudaa Nee Dehamu Devuni Aalayam 
Yavanudaa O Yavanudaa Nee Kalle Dehaaniki Deepamu (2)
Nee Kalle Thettethe Nee Deham Parishuddhame
Nee Choopulu Mohamaithe Aa Paapame Ninnu Eelune
Mosapoku Mosapoku O Yavanudaa
Ee Loka Andachandaalevee Shaashwatham Kaaduraa
||Yavanudaa||

1. Solomonu Gnaanamu Samsonu Balamu
KaapaadaleduGaa Vaari Yavana Paapamu (2)
Devudu Ichche Bahumaanam Prathi Manishiki Yavanam
Loka Aashaku Longipoyi Chesthe Neevu Paapamu
Maraninchina Maru Kshaname Jeevitham Kaale Narakamu
Moshe Laanti Nammakam Yosepu Laanti Parimalam 
Kreesthulo Prathidinam Vedajallali Sodaraa 
||Yavanudaa||

2. Dushtudu Yavana Vaanchalatho Neeku Valane Veyagaa
Vaakyamane Ee Khadgamutho Tharimi Tharimi Kottara (2)
Kaayalu Kaasina Chettuke Tagulunu Raalla Debbalu
Bhaktigaa Unna Varike Saathaanu Pettunu Shodhanalu
Yuddhamandu Sainikudu Venuka Thattu Choochuna
Shathruvulatho Chividaka Poraaduta Maanuna 
Rendanchula Khadgame Vaakyamane Mana Kavachamu 
Kreesthu Rakthamu Paapamulaku Prayaschitthamu Sodaraa 
||Yavanudaa||

-------------------------------------------------------
CREDITS : Lyrics : James Gandhala
Music : Sudhakar M Mario
Vocals : Surya Prakash Injarapu
--------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post