** TELUGU LYRICS **
యేసయ్యా నా ప్రాణమా - ఘనమైన స్తుతిగానమా (2)
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా (2)
అద్భుతమైన నీ ఆదరణే - ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగ వెంటాడెను - నే అలయక నడిపించెను
నా జీవమా - నా స్తోత్రమా - నీకే ఆరాధన
నా స్నేహము - సంక్షేమము - నీవే ఆరాధ్యుడా (2)
||యేసయ్యా||
చిరకాలము నాతో ఉంటానని - క్షణమైనా వీడిపోలేదని
నీలో నను చేర్చుకున్నావని - తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా (2)
ఏదైనా నా కున్న సంతోషము - నీతోనే కలిగున్న అనుబంధమే (2)
సృజనాత్మకమైన నీకృప చాలు - నే బ్రతికున్నది నీ కోసమే (2)
||యేసయ్యా||
జీవజలముగా నిలిచావని - జలనిధిగా నాలో ఉన్నావని
జనులకు దీవెనగ మార్చావని - జగతిలో సాక్షిగ ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా (2)
ఏదైనా నీకొరకు చేసేందుకు - ఇచ్చితివి బలమైన నీశక్తిని (2)
ఇదియేచాలును నా జీవితాంతము - ఇల నాకన్నియు నీవేకదా (2)

మధురముకాదా నీ నామధ్యానం - మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు నను నడుపువైనం - క్షేమముగా నా ఈలోక పయనం
స్తోత్రగీతముగా నే పాడనా (2)
నిజమైన అనురాగం చూపావయ్యా - స్థిరమైన అనుబంధం నీదేనయ్యా (2)
స్తుతుల సింహాసనం నీకొరకేగా - ఆసీనుడవై ననుపాలించవా (2)

స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
స్తుతిపాత్రుడా - స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే - నీలో నా యేసయ్యా
** ENGLISH LYRICS **
Yaesayyaa Naa Praanamaa - Ghanamaina Sthuthigaanamaa (2)
Adbhutamaina Nee Aadharanae - Aashrayamaina Nee Samrakshanayae
Nanu Needaga Ventaadenu - Nae Alayaka Nadipinchenu
Naa Jeevamaa - Naa Sthothramaa - Neekae Aaraadhana
Naa Snaehamu - Sankshaemamu - Neevae Aaraadhyudaa (2)
||Yaesayyaa||
Chirakaalamu Naatho Untaanani - Kshanamainaa Veedipolaedhani
Neeloo Nanu Chaerchukunnaavani - Thandritho Aekamai Unnaamani
Aanandhagaanamae Nae Paadhanaa (2)
Aedhainaa Naa Kunna Santhoshamu - Neethonae Kaligunna Anubandhamae (2)
Srujaanaathmakamaina Neekrupa Chaalu - Nae Brathikunnadhi Nee Kosamae (2)
||Yaesayyaa||
Jeevajalamugaa Nilichaavani - Jalanidhigaa Naalo Unnaavani
Janulaku Dheevenagaa Maarchaavani - Jagathilo Saakshigaa Unchaavani
Uthsahagaanamae Nae Paadhanaa (2)
Aedhainaa Neekoraku Chaesaendhuku - Icchithivi Balamaina Nee Shakthini (2)
Idhiyae Chaalunu Naa Jeevithaanthamu - Ila Naakanniyu Neevaekadhaa (2)
||Yaesayyaa||
Madhuramukaadhaa Nee Naamadhyaanam - Marupuraanidhi Nee Praemamadhuram
Maeluchaeyuchu Nanu Nadupuvainam - Kshamaamugaa Naa Eeloka Payanam
Sthothragithamugaa Nae Paadhanaa (2)
Nijamaina Anuraagam Choopaavayyaa - Sthiramaina Anubandham Needenaayyaa (2)
Sthuthula Simhaasanam Neekorakuegaa - Aaseenudavai Nanupaalinchavaa (2)
||Yaesayyaa||
Sthuthipaathrudaa - Sthothraarhhudaa Neekae Aaraadhana
Aanandhamae Paramaanandhamae - Neeloo Naa Yaesayyaa
-------------------------------------------------
CREDITS : Hosanna ministries
-------------------------------------------------