5590) ఆకాశ వాకిళ్ళు తెరచి ఆశీర్వాదపు జల్లులు కురిసి

** TELUGU LYRICS **

ఆకాశ వాకిళ్ళు తెరచి 
ఆశీర్వాదపు జల్లులు కురిసి 
ఆత్మీయ మేలులను చూపి 
ఆశ్చర్య కార్యములు చేసీ 
అ.ప : ఆశీర్వదించును        
యేసయ్య నిన్ను ఆనందతైలముతో
అభిషేకించున్ (2) 
||ఆకాశ||

అనేక జనముల కంటే
అధికముగా హెచ్చించును
నీచేతి పనులన్నింటినీ    
ఫలియింపచేయును (2)
ఆశీర్వదించును యేసయ్య    
నిన్ను ఐశ్వర్య ఘనతను నీకిచ్చును (2)
||ఆకాశ||

మునుపటి దినముల కంటే 
రెండంతలు దీవించును 
నీవెళ్ళు స్థలములన్నిటిలో 
సమృద్ధిని కలిగించును (2)
ఆశిర్వదించును యేసయ్య     
నిన్ను స్వస్థతను నెమ్మదిని నికిచ్చును (2)
||ఆకాశ||

ఆత్మ బలముతో నిండి 
అగ్ని వలె మారుదువు 
ఆత్మ ఫలములు కలిగి
అభివృద్ధి పొందెదవు (2)
అభిషేకించును యేసయ్య    
నిన్ను ఆత్మీయ వరములు నీకిచ్చును (2)
||ఆకాశ||

----------------------------------------------------------------
CREDITS : Akshaya Praveen, Sis.Sharon
----------------------------------------------------------------